ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆ ఛాన్స్ ఇవ్వొదు
మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యం వహించొద్దని నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీల సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై సుదర్ఘీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వొద్దని నేతలకు సృష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల కోసం పార్లమెంట్ స్థానాల వారీగా ఇన్ఛార్జ్లు నియమిస్తామని వెల్లడించారు.













