భారత కాన్సుల్ జనరల్ తో మంత్రి కేటీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్‌తో సమావేశమయ్యారు. భవిష్యత్ వ్యాపార అవకాశాలు, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు, ప్రఖ్యాత కంపెనీలతో కూడిన తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి గమ్యస్థానంగా నిలిచిందని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. న్యూయార్క్ నగరంలో ప్రధాన కార్యాలయం కలిగిన అమెరికన్ గ్లోబల్ మీడియా, మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హోల్డింగ్ కంపెనీ అయిన ఓమ్నికామ్ గ్రూప్ ఇంక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఇందులో పరస్పర సహకార అవకాశాలపై చర్చించారు.













