రెండో రాజధాని ప్రాతిపాదన లేదు
హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి సృష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామని, త్వరలోనే దానిని పూర్తిచేస్తామని తెలిపారు. విద్య, వైద్యం, నదుల అనుసంధానంపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు.













