అధిష్ఠానం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిలుపు

కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. పార్టీలో చేరికలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఆదివారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో కిషన్ రెడ్డికి పిలుపు వచ్చింది.