ఏ సీఎం కూడా ఈ రకంగా చేయలేదు
గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని ప్రజలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిరదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో కేసీఆర్ చేసే పనుల వల్ల రాష్ట్రం పరువుపోతోందన్నారు. కేటీఆర్ సీఎం అవ్వరేమోనన్న భయంతో కేసీఆర్ ఘర్షణాత్మక వైఖరి కోరుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఎవరున్నా కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగేతర శక్తులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు సాధించిందేమీ లేదని, అందుకే ఢిల్లీ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపోజల్ పంపలేదన్నారు. గతంలో అనేక సార్లు గవర్నర్లు, ముఖ్యమంత్రులకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ, ఏ సీఎం కూడా ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదన్నారు. విచిత్రమైన రాజకీయాలు, వ్యవహారం తెలంగాణలో జరుగుతోందని విమర్శించారు.













