ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ కు నష్టం : కవిత
కాళేశ్వరాన్ని (Kaleshwaram) వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. హైదరాబాద్ లో కవిత మీడియాతో మాట్లాడుతూ రెండున్నరేళ్లు దారుణంగా వ్యవహరించి పంటలు ఎండబెట్టారని ఆరోపించారు. కమీషన్ల (Commissions) కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారని మండిపడ్డారు. మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీలో తీవ్రమైన అవినీతి జరుగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ (Future City) పేరుతో హైదరాబాద్ (Hyderabad) కు నష్టం చేయవద్దని కోరారు.
ఇవి కూడా చదవండి








