జనవరి 1 నుంచి నుమాయిష్ : మంత్రి శ్రీధర్ బాబు
జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్`2024) ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే నుమాయిష్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తారని వెల్లడిరచారు. పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదిక. ఈసారి 2,400 పైచిలుకు ఎగ్జిబిటర్లు రానున్నారు. తొలిసారిగా శాకాహారం రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రదర్శకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలి. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని యోచిస్తున్నాం. నుమాయిష్‌ను విజయవంతం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.













