పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు వీలైనంత ఎక్కువ కల్పించడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం అని వెల్లడించారు. ఫార్మాసిటీ విషయంలో ప్రజల ఆలోచనలు కూడా పరిగణనలోకి తీసుకొని ఓ నిర్ణయాన్ని వస్తామన్నారు. శాసనసభలో మంచి ఫలవంతమైన చర్చలు జరిగేలా చూస్తామని తెలిపారు.













