అవన్నీ సర్కార్ హత్యలే : కేటీఆర్
మంచిర్యాల జిల్లా (Mancherial District)లో కొనుగోలు కేంద్రాల వద్ద, రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు రైతులు మృతి చెందడం బాధాకరమని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా? అని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారాల తరబడి పండించిన పంట కొనకుండా ప్రభుత్వ అలసత్యం వహిస్తోందని మండిపడ్డారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య (Medical) సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మÖడు రోజుల్లో వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద ఏడుగురు రైతులు మరణించారని, అవన్నీ సర్కార్ హత్యలేనని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి








