చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట
భారత పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేసిన కేసులో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్రం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10(3) అంశాలను ఆధారం చేసుకుని ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టు జూన్ 10న ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పట్టించుకోలేదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వేసిన రిట్‌ను న్యాయమూర్తి చల్లా కోదండరామ్ విచారించారు. కేంద్రం కౌంటర్ పిటిషన్ వేయాలని, విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేస్తామని, అప్పటి వరకు రద్దు నిర్ణయం అములను (4 వారాలు) నిలిపివేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.













