తెలంగాణలో మరో 1,269 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1269 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కొవిడ్ కేసుల సం•్య 34,671కి పెరిగింది. 11,883 మంది చికిత్స పొందుతుండగా 1563 మంది కోలుకున్నారు. 8 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 356కు చేరింది. ఆదివారం నిర్ధారణ అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ (హైదరాబాద్)లో 800, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 94 సంగారెడ్డిలో 36, కరీంనగర్లో 23, నాగర్‌కర్నూలులో 23, మహబూబ్‌నగర్‌లో 17, నల్గొండలో 15, వనపర్తిలో 15, మెదక్‌లో 14, వరంగల్ లో 12, నిజామాబాద్ జిల్లాలో 11 ఉన్నాయి. ఆదివారం నాటి ఫలితాల్లో రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.













