ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి : సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీ (Future City) అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మీర్ఖాన్ పేట్ లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారని, ఆయా గ్రామాల్లో సభలు పెట్టి తీర్మానాలు చేసి కలెక్టర్ (Collector), మంత్రి (Minister)కి పంపాలని తెలిపారు. ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో భాగం చేసే చర్యలు చేపడతామని, ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆదర్శ నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








