లోక్ సభ ఎన్నికల్లో వారికి సీట్లు ఇస్తామని.. ప్రమాణం చేయాలి : రఘునందన్ రావు
తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టపడేవారికి బీఆర్ఎస్లో ఏనాడూ గుర్తింపులేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్లు ఇస్తామని కేటీఆర్, హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరును ప్రచారానికి ఉపయోగించుకుని ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవుల్లో ఉంటూ రూ.వందల కోట్లు సంపాదించిన అధికారులకు రాజకీయ పదవులు కట్టబెట్టారు. సీట్లు అమ్ముకోవడం, డబ్బు దండుకోవడమనే ఆలోచనతో బీఆర్ఎస్ పనిచేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతపరంగా విభిన్నమైన పార్టీలు. రెండు ఒకటేనని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. ఇతర పార్టీలతో మా పార్టీ పొత్తులు పెట్టుకోద్దు. అహంకారం వల్లే బీఆర్ఎస్ నేతలు ప్రజలకు దూరమయ్యారు అని అన్నారు.













