పావులూరికి రాష్ట్రపతి సన్మానం
ప్రపంచ భాషల్లో హిందీకి ప్రముఖ స్థానం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. మారిషస్‌లో ఇటీవల నిర్వహించిన 11వ ప్రపంచ హిందీ మహాసభల్లో పాల్గొన్న పండితులను ఢిల్లీలో ఆయన సన్మానించారు. సన్మానం అందుకున్నవారిలో హిందీ భాష వ్యాప్తికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య ఉన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ భారతదేశం వెలుపల కోటి మందికి పైగా హిందీ మాట్లాడుతున్నారని, విదేశాల్లోని ప్రముఖ విశ్వ విద్యాలయాల్లోనూ హిందీని బోధిస్తున్నారన్నారు. శివ రామకృష్ణయ్య మాట్లాడుతూ నాడు గాంధీ ఉపదేశం మేరకు తామంతా హిందీ భాష వ్యాప్తికి కృషి చేశామని తెలిపారు.













