ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జమ్మూకశ్మీర్ రెండు ముక్కలుగా విడిపోయింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7వ తేదీన ప్రకటన చేయనున్నారు.













