చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వర్గాల్లో
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ కనిపించారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. ప్రశాంత్ కిషోర్‌తో పాటు షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు.













