ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేశ్
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (Nara Lokesh) దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ (Ramachandra Mohan), ఆలయ ఈవో శీనా నాయక్ (Sheena Naik) స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనానికి ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట దుర్గగుడి పాలకమండి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (Borra Radhakrishna), ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు.








