ఏఐఐబీ బ్యాంక్ ఉన్నతాధికారులతో లోకేష్ భేటీ
రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చైనా పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు ఇచ్చిన ఏఐఐబీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌ని వాన్ అమర్స్బర్గ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మంత్రి లోకేష్ వివరించారు. పంచాయితీరాజ్ శాఖకోసం తయారు చేసిన డ్యాష్‌బోర్డ్ చూపిస్తూ ఒక్కో అంశం గురించి తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, టెక్నాలజీ వినియోగం గురించి అమర్స్బర్గ్ ఆసక్తి కనబర్చారు. వేసవి కాలంలో ప్రత్యేక టెక్నాలజీ వినియోగించడం వలన ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగునీటి ఖర్చు ఘననీయంగా తగ్గించగలిగా మని, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం కావాలని మంత్రి కోరారు. అనంతరం స్పందించిన అమర్స్బర్గ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, టెక్నాలజీ వినియోగంలో అందరికంటే ముందు ఉన్నారని ప్రశంసించారు.













