Minister Gottipati :సీఎం చంద్రబాబు నాయకత్వంలో.. ఒక్కొక్కటిగా : మంత్రి గొట్టిపాటి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరంలోని ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు ఆయన పింఛన్లు(Pensions) పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీరోడ్లు (CC roads), పాఠశాలల(schools) అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.













