Loan Mela: ఏపీలో స్టార్టప్‌లకు గుడ్ న్యూస్.. మంగళగిరిలో మెగా ‘లోన్ మేళా 2026’
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) ఆర్థిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) క్యాంపస్ వేదికగా మార్చి 8న భారీ ‘లోన్ మేళా-2026’ను (Loan Mela) నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (APIS), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
20కి పైగా బ్యాంకులు..
ఈ మెగా లోన్ మేళాలో (Loan Mela) 20కి పైగా జాతీయ బ్యాంకులు, ప్రముఖ ఆర్థిక సంస్థలు పాలుపంచుకోనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 1,000కి పైగా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ పి. ధాత్రిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నేరుగా బ్యాంకర్లతో ముఖాముఖి సమావేశమై, ప్రభుత్వ మద్దతుతో నడిచే సబ్సిడీ స్కీమ్‌లు, రుణ సదుపాయాలపై పూర్తి అవగాహన పొందవచ్చు. అర్హత ఉన్న దరఖాస్తుదారులకు అక్కడికక్కడే (ఆన్-ది-స్పాట్) లోన్ ప్రాసెసింగ్ (Loan Mela) చేసి రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
ఏఐ ఆధారిత ‘డీఆర్పీ’లు..
ఈ ఈవెంట్ యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. పాల్గొనే ఔత్సాహికులకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఆధారిత ‘వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను’ (Detailed Project Reports – DPRs) అందజేయనున్నారు. దీనివల్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనల నాణ్యత పెరిగి, బ్యాంకుల (Loan Mela) నుంచి సులభంగా రుణాలు మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. దీనితో పాటు నిధుల సేకరణ, క్రెడిట్ గ్యారెంటీ యంత్రాంగాలు, రిస్క్ మేనేజ్మెంట్, క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకునే విధానాలపై ఆర్థిక నిపుణులతో ప్రత్యేక నాలెడ్జ్ (అవగాహన) సెషన్లను కూడా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను పటిష్టం చేయడం, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, ఆవిష్కర్తలకు – ఆర్థిక సంస్థలకు మధ్య బలమైన వారధిగా నిలవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఏపీఐఎస్ (APIS) స్పష్టం చేసింది. వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకోవాలనుకునే యువ పారిశ్రామికవేత్తలు ఈ అద్భుత అవకాశాన్ని (Loan Mela) సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి







