ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు : మంత్రి సత్యకుమార్
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కనుమరుగవుతుందని మంత్రి సత్యకుమార్ (Satyakumar) వ్యాఖ్యానించారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర ఉత్సవాల్లో భాగంగా సారెను సమర్పించిన ఆయన ఆలయం బయట మీడియాతో సత్యకుమార్ మాట్లాడారు. వరుస ఓటములతో ఇప్పటికే ఉనికి కోల్పోయి ఇతర పార్టీలపై అధారపడి ఒకట్రెండు స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడిందన్నారు. దేశంతోపాటు రాష్ర్టాలను సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ పలుమార్లు రాష్ట్రపతి పాలన తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎన్టీ రామారావు (N.T. Rama Rao) ప్రభుత్వాన్ని కూలదోసిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి కాంగ్రెస్ కు ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడమే డీఎంకే (DMK)కి శాపంగా మారి అధికారాన్ని కోల్పోయిందని తెలిపారు. తమిళనాడులో జగన్ (Jagan) ఫొటోతో విజయ్ గెలిచాడంటూ వైసీపీ నేతలు చెప్పుకోవడం వారి మానసిక స్థితిని తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు.








