సింగపూర్‌కు చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశాలు
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి. తొలిరోజు పర్యటనలో భాగంగా YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో సీఎం చంద్రబాబు భేటీ. సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై YCH గ్రూప్‌తో చర్చలు. ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై చర్చ.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• ఏపీకి 1,000 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. లాజిస్టిక్స్ పరంగా అనేక అనుకూలతలు ఉన్నాయి.
• హైవేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే కనెక్టవిటీ ఉంది. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నాం.
• హార్టికల్చర్‌పై 1 లక్ష కోట్లు ఇవ్వెస్ట్ చేయబోతున్నాం. ఆక్వాకల్చర్‌లో నెంబర్ 1గా ఉన్నాం.
• ఆహార ఉత్పత్తులకు వాల్యూఎడిషన్ ద్వారా ఎగుమతులకు ప్రయత్నం చేస్తున్నాం.
• ఏపీలో అపార అవకాశాలున్నాయి… ప్రొడక్షన్ లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.
• ఏపీని సందర్శించండి… రాష్ట్రంలో ఉన్న పాలసీలు, అనుకూలతలు చూసి పెట్టుబడులు పెట్టండి.









