శ్రీసిటీలో భారీ పెట్టుబడులు.. రూ.1,000 కోట్లతో
అమెరికా (America)కు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ (Air conditioner) తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో ఉత్పత్తి సంస్థను ప్రారంభించనుంది. ఈమేరకు వచ్చే శ్రీసిటీ (Sri City)లో ఆ సంస్థ సీఎండీ డేవిడ్ గిట్లిన్ (David Gitlin) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హాజరయ్యే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. రూ.1000 కోట్ల పెట్టుబడితో గృహేతర వినియోగానికి సంబంధించిన భారీ ఎయిర్ కండిషనర్లను ఈ సంస్థ తయారు చేయనుంది. గృహ, వాణిజ్య వినియోగానికి ఒక టన్ను నుంచి రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలను సరఫరా చేస్తున్న క్యారియర్ సంస్థలో, రాష్ట్రంలో పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల అభివృద్ధి నేపథ్యంలో 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన ఎయిర్ కండిషనర్లను తయారు చేయనున్నారు. వీటిని డేటా సెంటర్లలో వినియోగిస్తారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో సహా ఇంకొన్ని డేటా సెంటర్లను స్థాపిస్తామంటూ రిలయన్స్‌తో సహా పలు దిగ్గజ సంస్థలు ప్రతిపాదించిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీ సామర్థ్యంతో కూడిన ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ రానున్నదని గ్రహించి ఈ యూనిట్ స్థాపనకు క్యారియర్ సిద్ధమైంది. ఈ సంస్థకు శ్రీ సిటీలో 39 ఎకరాలను కేటాయించారు. 3000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








