భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలో జాతికి అంకితం : మంత్రి సంధ్యారాణి
కూటమి ప్రభుత్వంలో విశాఖ అంటే గూగుల్ (Google), టీసీఎస్ (TCS) వంటి ప్రపంచస్థాయి సంస్థలు గుర్తొస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhyarani) తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్టుబడిదారుల్లో భరోసా నింపేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విశాఖ అంటే గంజాయి, మాదకద్రవ్యాలు గుర్తొచ్చే పరిస్థితి ఉండేదని దుయ్యబట్టారు. అభివృద్ధి కంటే అరాచకాలు, భూకబ్జాలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడారు. ఇప్పుడు అరకు, పాడేరు, ప్రాంతాల్లో గంజాయి తోటల స్థానంలో కాఫీ సాగవుతోంది. అల్లూరి సీతారామరాజు పేరుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








