ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు రూ.25 లక్షల విరాళం

కోవిడ్ -19 నివారణలో భాగంగా సహాయ చర్యల (ఉచిత వ్యాక్సినేషన్) కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‍ఆర్‍టీఎస్) అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి ఆయన సతీమణి రామలక్షి రూ.25 లక్షల విరాళాన్ని అందించారు. సంబంధిత చెక్‍ను వెంకట్ ఎస్ మేడపాటి కుటుంబ సభ్యులు సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి అందజేశారు.