కిసాన్ రైలు ప్రారంభం
కిసాన్ రైలు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే కిసాన్ రైలు ఛార్జీల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఛార్జీలు తగ్గిస్తే మరింత ఉపయోగకరమని అన్నారు. అనంతపురం-ఢిల్లీ మధ్య కిసాన్ రైలు సర్వీసును వీడియో లింక్ ద్వారా ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నప్పటికీ కొవిడ్ వ్యాప్తి కారణంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రాష్ట్రంలో రైతులు పండించే మొత్తం పంటలో రాష్ట్రమంతా కలిపి 10 నుంచి 15 శాతం వినియోగమే ఉంటుదన్నారు..
దక్షిణ భారత్కు ఆంధప్రదేశ్ పండ్ల ఉత్పత్తి కేంద్రంగా ఉంది. అయితే కొవిడ్ సమయంలో రవాణా సౌకర్యం లేని మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కష్టంగా మారింది. కిసాన్ రైలు లాంటి ప్రత్యామ్నాయాలు, రైతులకు మరింత అండగా ఉండేలా, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకునేందుకు ఉపకరిస్తాయి అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.













