వారికి అన్యాయం జరిగితే ప్రభుత్వం సహించదు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నామన్నారు. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. దిశ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లోపే సాయం అందేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు దిశ పెట్రోలింగ్ వాహనాలు రక్షణ ఇస్తాయని తెలిపారు.













