మరో రెండు నెలలు కేంద్ర బలగాలు బెంగాల్ లోనే.. అమిత్ షా వ్యాఖ్యల్లో ఆంతర్యం?
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా 60 రోజుల పాటు కేంద్ర బలగాలు బెంగాల్ లోనే వుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ప్రతి మూలలో కేంద్ర బలగాలను మోహరించిందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, రాష్ట్రంలోనే 60 రోజుల పాటు కేంద్ర బలగాలను వుంచుతామని ప్రకటించారు.
అంతేకాకుండా ప్రజలకు ఓ ప్రత్యేకమైన అప్పీల్ ను కూడా చేశారు. ‘‘సోదర సోదరీమణులారా.. 29 న ఓటేయడానికి వెళ్లండి. దీదీ గూండాలకు భయపడకండి. ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ప్రతి మూలలో కేంద్ర బలగాలను మోహరించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా రాష్ట్రంలోనే 60 రోజుల పాటు కేంద్ర బలగాలను ఉంచుతాం’’ అని అమిత్ షా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
1. దీని వెనుక ఆంతర్యం ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే.. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంతంగా, నిర్భయంగా పోలింగ్ నిర్వహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్న సిగ్నల్స్ ను పంపించినట్లైంది.
2.అలాగే 2021 లో ఎన్నికల తర్వాత హింసాకాండ తీవ్రంగా కొనసాగింది. మే 2న 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, పలు జిల్లాల్లో విస్తృత హింస చెలరేగింది. ముఖ్యంగా బీజేపీ, టీఎంసీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలలో హత్యలు, దహనకాండ, దోపిడీలు, దాడులు జరిగాయి. ప్రతిపక్ష నేతలపై దమన కాండ కొనసాగింది. ఈ సారి అలా కాకుండా చూసే బాధ్యత తమదే అని చెప్పినట్లైంది.
3. అంతేకాకుండా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశాలున్న నియోజకవర్గాల్లో బీజేపీ మద్దతుదార్లకు ఎన్నికల అనంతరం ప్రతీకార చర్యల భయం లేకుండా, స్వేచ్ఛగా ఓటు వేయవచ్చన్న సిగ్నల్స్ ఇచ్చారు.
4.బల ప్రయోగం, బెదిరింపులు, ఎన్నికల్లో హింస ద్వారానే టీఎంసీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. దీని ద్వారా ఈ వాదన మరింత బలపడుతుంది. బీజేపీ మద్దతుదారులు నిర్భయంగా ఓటు వేయవచ్చన్న సంకేతాలు కూడా ఇచ్చారు.
5. అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కునే వారు, బెంగాల్ లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇంకా నిర్ణయం తీసుకోక, తటస్థంగా వున్న వారిని ప్రభావితం చేయడానికి కూడా ఈ ప్రకటన అయి వుండొచ్చని ఓ భావన. కేంద్రం అందరికీ రక్షణ కల్పిస్తుందని, తద్వారా ఓటర్లు నిర్భయంగా వుండొచ్చన్నది కూడా చెప్పి వుండొచ్చు.
ఇవి కూడా చదవండి








