బెంగాల్ ‘దీదీ’ కోట బద్ధలు.. అమిత్ షా ‘మాస్టర్’ వ్యూహంతో కమల వికాసం!
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటను భారతీయ జనతా పార్టీ (BJP) బద్ధలు కొట్టింది. 2021 నాటి వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న బీజేపీ, అమిత్ షా నేతృత్వంలో పక్కా వ్యూహంతో ముందుకు సాగి ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
గత ఎన్ని‘పన్నా ప్రముఖ్’ వ్యవస్థను బలోపేతం..
కల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయిన స్థానాలపై ఈసారి బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అమిత్ షా కనుసన్నల్లో సునీల్ భన్సల్, భూపేంద్ర యాదవ్ వంటి వ్యూహకర్తలు క్షేత్రస్థాయిలో ‘పన్నా ప్రముఖ్’ వ్యవస్థను బలోపేతం చేశారు. ప్రతి 10-15 కుటుంబాలకు ఒక కార్యకర్తను కేటాయించి, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో సఫలమయ్యారు. దీనివల్ల రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 92 శాతం పోలింగ్ నమోదై, అది బీజేపీకి భారీగా కలిసొచ్చింది.
ఇవి కూడా చదవండి
‘ఛార్జిషీట్లు’ విడుదల చేసి ప్రజల్లోకి..
ఈసారి బీజేపీ నేరుగా మమతా బెనర్జీని లక్ష్యం చేసుకోకుండా, స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టింది. 220 నియోజకవర్గాల్లో టీఎంసీ నేతలపై ‘ఛార్జిషీట్లు’ విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, శాంతిభద్రతల వైఫల్యం, బంగ్లాదేశ్ చొరబాట్ల వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకుంది. ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యురాలి తల్లికి టికెట్ కేటాయించడం ఓటర్లను ఆలోచింపజేసింది.
మహిళలు, రైతుల మనసు గెలిచిన మేనిఫెస్టో..
టీఎంసీ ‘లక్ష్మీ భండార్’ పథకానికి ధీటుగా బీజేపీ ప్రకటించిన హామీలు మహిళా ఓటర్లను ఆకట్టుకున్నాయి.
ప్రతి మహిళకు నెలకు రూ. 3,000 ఆర్థిక సాయం.
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్.
వరి క్వింటాల్‌కు రూ. 3,100 మద్దతు ధర.
యువతకు నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి.
హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట..
ఎన్నికల వేళ ఈసీ తీసుకున్న నిర్ణయాలు కూడా టీఎంసీకి ఇబ్బందికరంగా మారాయి. సుమారు 2.4 లక్షల మంది కేంద్ర బలగాలను మోహరించడంతో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడింది. ఉత్తర బెంగాల్‌లోని రాజబోంగ్షీల సమస్యలను అమిత్ షా స్వయంగా పర్యవేక్షించి అక్కడి స్థానాలను కైవసం చేసుకున్నారు.
సువేందు అధికారి వంటి స్థానిక నేతలను ముందుంచి, అమిత్ షా స్వయంగా 66 ర్యాలీలతో బెంగాల్ అంతటా పర్యటించి కేడర్‌లో ఉత్సాహం నింపారు. ఫలితంగా దశాబ్దన్నర కాలం తర్వాత బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది.
ఇవి కూడా చదవండి








