Health Tips: భానుడి భగభగలు.. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే!
Health Tips: చలికాలం వీడ్కోలు పలికి ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో చాలామందిలో అలసట, అజీర్తి , డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల వల్ల శరీరం త్వరగా శక్తిని కోల్పోతుంది. అయితే, ఈ వేసవి తాపాన్ని తట్టుకుని శరీరాన్ని సహజంగా చల్లబరచడానికి ‘బార్లీ నీళ్లు’ అద్భుత ఔషధంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బార్లీ నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
తక్షణ శక్తి: బార్లీ నీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి కీలకమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించి, శరీరాన్ని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతాయి.
జీర్ణక్రియ మెరుగు: ఈ గింజల్లో ఉండే అధిక పీచు పదార్థం (Fiber) జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. గ్యాస్, అజీర్తి, కడుపుబ్బరం , మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మహిళల ఆరోగ్యానికి మేలు: మహిళలు తరచుగా ఎదుర్కొనే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) సమస్యను తగ్గించడంలో బార్లీ నీళ్లు బాగా పనిచేస్తాయి. ఇవి కాలేయం, మూత్రపిండాల్లోని వ్యర్థాలను బయటకు పంపి, ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి.
బరువు తగ్గడానికి : బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి పానీయం. ఒక గ్లాసు బార్లీ నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అతిగా తినడం తగ్గుతుంది. ఇది మెటబాలిజాన్ని పెంచి శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది.
వడదెబ్బ నుంచి రక్షణ: ఎండలో బయటకు వెళ్లేవారు ఒక గ్లాసు బార్లీ నీటిలో కాస్త నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ తగిలే ప్రమాదం తప్పుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రిస్తుంది.
వ్యాధినిరోధక శక్తి: బార్లీలో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి విటమిన్లు, మినరళ్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.







