కోటీ 18 లక్షలకుపైగా జనానికి సోకిన కరోనా
ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అమెరికా నుంచి ఇండియా దాకా కరోనా విశ్వరూపం చూపిస్తోంది. అమెరికాలో ఇటీవలికాలంలో కరోనా కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. దానికితోడు ట్రంప్ వైఖరి, కొన్ని చోట్ల ప్రజల నిర్లక్ష్యం వంటివి అమెరికాలో కేసుల పెరుగుటకు కారణమవుతున్నాయని వర్గాల కథనం. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం కోవిడ్ 19 బారిన పడిన కేసుల సంఖ్య కోటీ 18 లక్షలు దాటింది. ఇప్పటివరకు కరోనాతో 5లక్షల 43 వేల 433 మంది మరణించారు. విశ్వవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటీ 18 లక్షల 41 వేల 627 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.30 లక్షల 59 వేల 428 కరోనా పాజిటివ్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా లక్షా 33 వేల 347 మంది మరణించారు. మంగళవారం సాయంత్రానికి 31లక్షలకు 3వేలు తక్కువ కేసులతో అగ్రస్థానంలో ఆ దేశం కొనసాగుతోంది. 16లక్షలకు పైగా బాధితులు ఈ వ్యాధితో బాధపడుతుండగా ఇప్పటివరకు 1లక్షా33వేల మంది మృత్యువాత పడ్డారు.






