ఆగ్రరాజ్యం విలవిల…
కరోనా ఉధృతికి అగ్రరాజ్యం అమెరికా నిలువెల్లా వణికిపోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే రోజే అత్యధిక కేసులు అమెరికాలో నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే ఏకంగా 55,274 పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. రెండు వారాల క్రితం అమెరికాలో రోజుకు 22 వేల కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా సగటున 50 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండగా 37 రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క ఫ్లోరిడాలోనే అత్యధికంగా 10 వేలకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. మొత్తం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు దాటింది.






