150 మంది నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్

అమెరికాలో 150 మంది నేషనల్ గార్డులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా భద్రత కల్పించిన 150 మంది నేషనల్ గార్డులకు కొవిడ్-19 సోకిందని పరీక్షల్లో వెల్లడైందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు కాపిటల్ భవనంపై జనవరి 6వ తేదీన దాడి ఘటన అనంతరం నేషనల్ గార్డులతో భద్రత ఏర్పాటు చేశారు. ఒక్క గురువారం ఒక్కరోజే కరోనాతో 4000 మంది మరణించారని వెల్లడైంది. తమ సిబ్బంది కరోనా నిబంధనలు పాటిస్తున్నారని నేషనల్ గార్డు అధికారులు చెప్పారు.