అమెరికా కరోనా వైరస్ కేసులు నమోదు చేయడంలో సరికొత్త రికార్డు
అమెరికా రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు నమోదు చేయడంలో రికార్డ్స్ సృష్టిస్తూనే ఉంది. శనివారం 11జులై రోజున 66,528 కొత్త కరోనా కేసులను అమెరికా నమోదు చేసింది. 24 గంటల వ్యవధిలో ఇది జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన లెక్క ప్రకారం, ఈ పరిణామాన్ని సరికొత్త రికార్డు గా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అభివర్ణించింది.
అమెరికాలో ఇప్పుడు మొత్తం 3,242,073 కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, మరణాల సంఖ్య 134,729 గా ఉంది, 760 అదనపు మరణాలు లెక్కించబడ్డాయి , మరియు గడిచిన ఐదు రోజులలో రోజు కి షుమారు గా 60,000 కొత్త కేసులను అమెరికా ఇప్పుడు చూసింది అని బాల్టిమోర్ ఆధారిత విశ్వవిద్యాలయం 11 జులై 2020 రాత్రి కి తన తాజా డేటాలో తెలిపింది.
లూసియానా
లూసియానాలో 2,600 కంటే ఎక్కువ కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి, ఏప్రిల్ 2 నుండి శనివారం 11 జూలై వరుకు ఇదే అతధికం అని లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ పేర్కొన్నారు. శనివారం 11 జూలై నుంచి లూసియానా లో బార్లను మూసివేయాలని మరియు నివాసితులు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ ఆదేశించారు.
దక్షిణ కరోలినా
శనివారం 11 జూలై ఒక రోజు అత్యధికంగా 2,200 కంటే ఎక్కువ కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి, మునుపటి రికార్డు జూలై 4 న 1,854 కొత్త కేసులతో నెలకొంది. “శనివారం 11 జూలై రాత్రి నుంచి , రాత్రి 11 గంటల తర్వాత అన్ని బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకం నిషేధించబడుతుందని , ఈ చర్య యువకులలో ఒకరి నుండి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గించడానికి సహాయపడుతుంది. రాష్ట్రంలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులలో 20 శాతానికి పైగా, యువకులు ఎక్కువుగా ఉన్నారు అని అంటే 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారని ఆరోగ్య అధికారులు తెలిపారు.” అని దక్షిణ కరోలినా గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్ ప్రకటించారు.






