అమెరికాలో కొత్తగా 34 వేలకు పైగా కేసులు
అమెరికాలో మళ్లీ కరోనా అలజడి పెరిగింది. వరుసగా మూడో రోజు 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంల్లో 34,831 మందికి వైరస్ సోకగా దేశంలో కేసుల సంఖ్య 26 లక్షల మార్కును చేరుకుంది. తాజాగా 285 మరణాలు సంభవించగా మృతుల సంఖ్య 1,28,562 కి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 1,60,586 కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వైరస్ నిర్ధారణకు ఆస్ట్రేలియా లాలాజల పరీక్షని అందుబాటులోకి తెచ్చింది. ప్రాణాపాయానికి చేరిన కొవిడ్ రోగికి అమెరికా, మరికొన్ని దేశాలు రెమిడిసివిర్ అనే ఔషధాన్ని అందిస్తున్నాయి. ఒక్కోరోగికి రూ.17.66 లక్షల ఖర్చు అవుతుందని ఈ ఔషధ తయారీ సంస్థ వెల్లడించింది.






