అమెరికాలో కోవిడ్ 19 కేసులు 2.5 మిలియన్లు
అమెరికాలో కరోనా కేసులు 2.5 మిలియన్ల కరోనా వైరస్ కేసులు అధిగమించింది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం ప్రపంచంలో కరోనా బాధిత దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. బాల్టిమోర్ ఆధారిత విశ్వ విద్యాలయం ప్రకారం శనివారం సాయంత్రం 5:30 నాటికి అమెరికాలో 2,500,419 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 43,121 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం అదనంగా 502 మరణాల నమోదవడంతో కరోనా కారణంగా మరణాల సంఖ్య 1,25,480కు పెరిగింది. ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా, నెవెడా రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు సృష్టించాయి. ఫోర్లిడాలో గత 24 గంటల్లో 9,585 కేసులు పెరిగాయి. యూఎస్‌లో సగానికిపైగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్లోరిడాలో బార్లపై కొత్త ఆంక్షలను ప్రకటించారు.






