అమెరికాలో 20 రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా
అమెరికాలో 20 రాష్ట్రాల్లో కరోనా ఉగ్ర రూపం దాల్చింది. శుక్రవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే ధోరణి కొనసాగితే మరణాల రేటు 2 లక్షలకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్లహామా, నెవడా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, కాలిఫోర్నియా, ఆరెగాన్, టెక్సాస్, నార్త్ కరోలినా, ఆర్కాన్సాస్, అరిజోనా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాలుగా గుర్తించారు. మే 15న స్టేట్ ఎట్ హోమ్ ఆంక్షలను ఎత్తివేసిన తరువాత అరిజోనాలో కరోనా కేసులు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. ఆ రాష్ట్రంలో కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.






