తెలంగాణలో కొత్తగా 1,284 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 43 వేలు దాటాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 1,284 కేసులు వచ్చాయి. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు. శనివారం 14,833 నమూనాలు పరీక్షించగా 1,284 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో ఈ కేసుల సంఖ్య 43,780కి చేరుకుంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 667 కేసులు, సంగారెడ్డిలో 86, రంగారెడ్డిలో 68, మేడ్చల్‌లో 62, కరీంనగర్లో 58, నల్గొండలో 46, వికారాబాద్‌లో 35 చొప్పున పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా చికిత్స నుంచి మరో 1,902 మంది కోలుకున్నారు. దీంతో చికిత్స నుంచి కోలుకున్నవారు 70 శాతం దాటినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 12,765 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.






