తెలంగాణలో మరో 1550 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 926 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డిలో 212, కరీంనగర్లో 86, మేడ్చల్ మల్కాజిగిరిలో 53, నల్లగొండలో 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19, వరంగల్ అర్బన్‌లో 16, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌లో 13, సూర్యాపేట, సిద్ధిపేట, జనగామ, భదాద్రి కొత్తగూడెంలో 10, వరంగల్ రూరల్, నిజామాబాద్‌లో 8, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7, పెద్దపల్లి, మెదక్, జయశంకర్ భూపాలపల్లిలో 6, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరిలో 5, వికారాబాద్ 3, నాగర్‌కర్నూల్ 2, వనపర్తి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో ఒకకేసు చొప్పున నమోదయ్యాయి. 9 మంది మృతిచెందగా, మొత్తం మృతులు 365కు పెరిగాయి.






