తెలంగాణలో కొత్తగా 1,278 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొత్తగా శుక్రవారం 1,278 నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 32,224కు పెరిగింది. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా 762 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 171, మేడ్చల్లో 85, సంగారెడ్డిలో 36, నల్గొండలో 32, కామారెడ్డిలో 23, మెదక్లో 22, ఖమ్మంలో 18, మంచిర్యాలలో 17, మహబూబ్నగర్, అదిలాబాద్, సూర్యాపేటల్లో 14 చొప్పున కేసులను గుర్తించారు. శుక్రవారం నాటి ఫలితాల్లో రాష్ట్రంలో 27 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులను నిర్ధారించారు. మొత్తం మరణాల సం•్య 339కి పెరిగింది. మొత్తం బాధితుల్లో 1 శాతం మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 17,081 పడకలు కొవిడ్ బాధితుల కోసం సిద్ధం చేయగా, ఇందులో శుక్రవారం నాటికి 1,618 మాత్రమే నిండి ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. కొవిడ్ కేంద్రంగా సేవలందిస్తోన్న గాంధీ ఆసుపత్రిలో 803 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, 1,087 పడకల ఖాళీగా ఉన్నాయి.






