తెలంగాణలో 1410 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గురువారం మరో 1410 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 30,946కు పెరిగింది. తాజా ఫలితాల్లో అత్యధికంగా జీహెచ్ ఎంసీ (హైదరాబాద్) పరిధిలో 918 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 125, సంగారెడ్డిలో 79, మేడ్చల్‌లో 67, వరంగల్ నగర జిల్లాలో 34, కరీంనగర్లో 32, మెదక్‌లో 17, భదాద్రి కొత్తగూడెంలో 23, నల్గొండలో 21, నిజామాబాద్‌లో 18, ఖమ్మంలో 12, సూర్యాపేటలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తంగా గురువారం ఫలితాల్లో 28 జిల్లాల్లో వైరస్ జాడలు కనిపించాయి. మరో ఏడుగురు ఈ వైరస్‌తో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 1,40,755 మందిని పరీక్షించగా 1,09,809 మందిలో వైరస్ లేదని తేలింది. గురువారం నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న కొవిడ్ పడకల్లో 9 శాతం మాత్రమే బాధితులతో నిండాయిన, ఇంకా చాలా అందుబాటులో ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.






