తెలంగాణలో మరో 945 మందికి కరోనా
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మరో 945 పెరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ 19 కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఇందులో 8,785 యాక్టివ్ కేసులుండగా 7,294 మంది కోలుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఏడుగురు మరణించగా, ఇప్పటివరకు 260 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం 3,457 మందికి పరీక్షలు నిర్వహించగా, 2,512 మందికి నెగిటివ్ వచ్చింది. ఇక ఇప్పటివరకు 88,563 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 869 పాజిటివ్ కేసులు వచ్చాయి.






