ఏపీలో కొత్తగా 2,593 కేసులు… 40 మరణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 38,044కి చేరింది. కరోనా కారణంగా ఇవాళ ఒక్కరోజే 40 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 492కి చేరింది. ఇవాళ తూర్పు గోదావరిలో 8 మంది, ప్రకాశంలో 8, చిత్తూరులో 5, కడపలో 4, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,159 మంది వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. మరో 19,393 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల వ్యవధిలో 22,304 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.






