ఏపీలో ఒక్కరోజే 1608 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1608 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1576 కాగా, 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొవిడ్ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనంతపురం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు ఉండగా, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 13,194గా ఉండగా, 11,936 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.






