ఏపీలో 1062 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,259కి చేరింది. వీరిలో 11,101 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 8,518 మంది వివిధ ఆస్పత్రుల్లోనూ, 2,376 మంది కొవిడ్ కేర్సెంటర్లలోనూ చికిత్స పొందుతున్నారు. తాజాగా 12 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కర్నూలు జిల్లాల్లో ముగ్గురు, అనంతపురం, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, విశాఖలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 27,634 నమూనాలను పరీక్షించినట్లు ప్రకటనలో పేర్కొంది.






