ఏపీలో 553 కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 19,085 నమూనాలు పరీక్షించగా, 553 కరోనా కేసులు నమోదయ్యాయి. స్థానికంగా ఉంటున్న 477 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10,884కు చేరింది. కొవిడ్ కారణంగా ఇవాళ కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 136కు చేరింది. గడిచిన 24 గంటల్లో 118 మంది కొవిడ్ రోగులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,989కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 5,760 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు 7,69,319 శాంపిల్స్ పరీక్షించగా, ఆంధప్రదేశ్ నుంచి 8783, ఇతర రాష్ట్రాల నుంచి 1730, ఇతర దేశాల నుంచి 371 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.






