ఎపిలో తగ్గని కరోనా….పెరిగిన కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇంకా విజ•ంభిస్తూనే ఉంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక, ఏపీ తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. రాష్ట్రంలో 376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.., విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 70 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసులు 7961కి పెరిగింది.. రాష్ట్రంలోని కేసులతో పాటు.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చినవారిని కలుపుకుంటే.. ఆ సంఖ్య 7,865 గా ఉంది. మ•తుల సంఖ్య 96కి పెరిగింది.. ఇక, గడిచిన 24 గంటల్లో 17,609 మంది శాంపిల్స్ పరీక్షించారు.. కరోనా బారిన పడి ప్రస్తుతం 3,069 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 3,065 మంది డిశ్చార్జ్ అయ్యారు.






