ఏపీలో 6456 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 304 పాజిటివ్ కేసులు నమోదనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదుకావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6456కి చేరింది. తాజా కేసుల్లో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 246కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 86. తాజాగా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47. రాష్ట్రంలో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2770. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2231. ఇప్పటి వరకూ కొవిడ్ బారిన పడిన విదేశీయుల సంఖ్య 210. ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన ఇతర రాష్ట్రాల వారి సంఖ్య 1159కు చేరింది.






