ఏపీలో 5,636 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 11,775 మంది నమూనాలు పరీక్షించగా 207 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 66 ఉండగా, రాష్ట్రంలో 141 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,636 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 80. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,559కి చేరింది. ప్రస్తుతం కొవిడ్ ఆసుపత్రుల్లో 1723 మంది చికిత్స పొందుతున్నారు.






