ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. గత 24 గంటల్లో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 10,331కి పెరిగింది. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 448 మందికాగా, ఇతర రాష్ట్రాల వారు 37 మంది, ఇతర ప్రాంతాల వారు 12 మంది. మొత్తం కేసుల్లో 8,306 మంది ఆంధప్రదేశ్‌కు చెందినవారు, 1661 మంది ఇతర రాష్ట్రాలవారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు 364 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,423 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 4,779 మంది నయమై డిశ్ఛార్జి అయ్యరు. ఈ రోజు కర్నూలులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు మృతి చెందారు. మొత్తం 129 మంది కరోనాతో చనిపోయారు. గత 24 గంటల్లో ప్రభుత్వం 36,047 శాంపిల్స్ పరీక్షించింది.






